అగస్టు 15 లోగా రుణ మాఫి పూర్తి
నల్గోండ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని భీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. కర్మ కాలి మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే.. రష్యా, చైనా అధ్యక్షుల మాదిరిగా ఏకంగా 30 ఏళ్ల పాటు తానే ప్రధానిగా నిరంకుశత్వంగా ఉండేలా చట్టం మారుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్వానీ లాంటి సీనియర్లను పక్కనపెట్టి.. అధికారం పీఠం మీద కూర్చున్న వ్యక్తి మోదీ అని అన్నారు.బీఆర్ఎస్ అంటే.. బంధు అయిన రాష్ట్ర సమితి అని.. వాళ్లకు ఒక్క సీటు గెలిస్తేనే మహాగణం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు విడుదల చేస్తే కొందరు కుట్రలు చేసి ఈసీకి ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపారని.. కోడు ముగిసిన తర్వాత యధావిధిగా రైతుబంధు అకౌంట్లలో పడుతుందని.. రుణమాఫీ సైతం ఆగస్టు 15 లోపు పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. వచ్చే మూడేళ్లలో ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ఏఎమ్ఆర్పి కెనాల్ లైనింగ్ పూర్తి చేస్తామని.. తొందరలోనే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రైలర్ కంప్లీట్ చేస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.