సభ్య సమాజం తలదించుకునేలా పసికందు అమ్మకం..! ఆర్.ఎం.పీ తో సహా ముఠా అరెస్ట్..!

- Advertisement -

సభ్య సమాజం తలదించుకునేలా పసికందు అమ్మకం..!

ఆర్.ఎం.పీ తో సహా ముఠా అరెస్ట్..!

వాయిస్ టుడే న్యూస్, మే 22 మేడిపల్లి :

పీర్జాదిగూడలో 3 నెలల పసికందును అమ్ముతున్న ముఠా ని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, సభ్యసమాజం తల దించుకునేలా చేసారు కొందరు మహిళలు, వీరు ఆడబిడ్డలే అన్నది మరిచారో ఏమో, అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు, ఓ స్వచ్చంద సంస్థ ద్వారా వీరి గుట్టు రట్టయ్యింది, అక్షర జ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకు ఆడిపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణ నగర్లో శోభా రాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఆర్ ఎం పీ వైద్యురాలు శోభా రాణి ఈ పని చేస్తుందని ఆమెని సంప్రదించగా, అమ్మాయి ని 4.50( నాలుగున్నర) లక్షలకు ఇప్పిస్తానని ఫోన్ ద్వారా చెప్పడంతో ముందుగా 10 వేలు అడ్వాన్స్ గా చెల్లించి, బుధవారం నాడు పాపకోసం వారు క్లినిక్ కు రాగ వేరే మహిళా అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించారు, దీంతో సంస్థ మహిళలు పోలీసులకు, మీడియా కు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా, పోలీసులు చేరుకొని వీరందరిని పోలీస్ స్టేషనకు విచారణ కోసం తరలించారు.పేద కుటుంబం పిల్లలను పోషించడం భారమణి తల్లి చెప్పడంతో మానవత్వతో అమ్మాయిని పిల్లలు లేనివారికి అమ్మానని శోభరాణి చెప్పడం కోసమేరుపు. శోభారాణి ఇంకా కొన్ని హాస్పిటల్ పేర్లు, చిలకనగర్ లో మరో మహిళా ఆర్ ఏం పీ, మ్యారేజ్ బ్యూరో మహిళా పేర్లను వారి వివరాలను కూడా తెలియజేసినట్టు సమాచారం, వీరందరు కలిసి ఈ పని చేసినట్టు తెలియజేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular