Wednesday, January 15, 2025

హరోం హర’ యాక్షన్ తో థియేట్రికల్ గా ఆడియన్స్ కి గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్

- Advertisement -

హరోం హర’ యాక్షన్ తో పాటు హై ఎమోషన్స్ వున్న మ్యాసీవ్ ఎంటర్ టైనర్. చాలా గూస్ బంప్ మూమెంట్స్ వున్నాయి. థియేట్రికల్ గా ఆడియన్స్ కి గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్

హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
ఇప్పటివరకూ చాలా లవ్ స్టొరీస్ చేశారు కదా.. హరోం హర లాంటి యాక్షన్ సినిమా చేయడం ఎలా అనిపించింది ?
-ఇన్ని రోజులు చేసిన మూవీస్ లో ఇలాంటి కైండ్ అఫ్ కలర్ రాలేదు. ఆర్ఎక్స్ 100 లో కూడా రా రస్టిక్ కలర్ వుంటుంది. అయితే ఇంత హార్డ్ కోర్ యాక్షన్ డ్రివెన్ వున్న మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇదే నా స్ట్రెంత్.  హరోం హర లో యాక్షన్ తో పాటు కోర్ ఎమోషన్స్ వుంటాయి. ఎమోషనల్ మ్యూజిక్ చేయడానికి కూడా స్కోప్ దొరికింది. మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే  చాలా పెక్యులర్ జోనర్ ఇది . సౌండ్ పంచ్ ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి.
ఈ కథ మీ దగ్గరికి రావడానికి కారణం ?
-డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక సేహరి టైం నుంచి పరిచయం. నా మీద కోర్ లెవెల్ ట్రస్ట్ పెట్టారు. మా మధ్య మంచి వేవ్ లెంత్ కుదిరింది.
ఈ సినిమాకి మీరు చేసిన రీసెర్చ్, ఎక్స్పరిమెంట్ ఏమిటి ?
-1989లో జరిగే కథ ఇది. ఇప్పుడున్న యూత్ కు అప్పుడున్న ఓ జీవితాన్ని ప్రజెంట్ చేస్తున్నారు డైరెక్టర్. ఆ రెట్రో కల్చర్ ని ఇన్ కార్పరేట్ చేస్తూ మ్యాసీ అటెంప్ట్ ఇందులో చేశాం. డెఫినెట్లీ ఇది ఠఫ్ జాబ్. అయితే నాకు మొదటి నుంచి ఛాలెంజస్ ఇష్టం. దీన్ని కూడా ఒక ఛాలెంజ్ తీసుకొని చేశాను. నాకు రెట్రో జోనర్ ఇష్టం. ఆడియన్స్ థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేశారు. సినిమా మేము అనుకున్నట్లు వచ్చింది. సుధీర్ బాబు గారు, డైరెక్టర్, అందరూ చాలా హ్యాపీగా వున్నారు. ఇందులో విజువల్ చాలా గ్రాండ్ గా వుంటుంది. విజువల్ కి తగ్గట్టే మ్యూజిక్ కూడా చాలా గ్రాండియర్ గా చేయడం జరిగింది. సౌండ్ డిజైన్ అద్భుతంగా వుంటుంది.
ఇందులో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన ఎలిమెంట్ ఏమిటి ?
-కొత్తగా మ్యాసీవ్ గా చేయాలని ముందే డిసైడ్ అయ్యాం. సౌత్ ఇండియన్ నాటు కలర్ ని స్టయిలీష్ డ్రివెన్ గా పట్టుకెళ్ళడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇందులో హెవీ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్ కూడా వున్నాయి. అది కూడా అగ్రెసివ్ గా వుంటుంది. ఈ రెండిటి మధ్య ట్రాన్సిషన్ చూపించడం ఛాలెంజింగ్ గా అనిపించింది.
ఇప్పటి వరకూ విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కనులెందుకో లాంటి మరో మెలోడీ ఇందులో వుందా ?
-నెక్స్ట్ రాబోతున్న సాంగ్స్ ఎమోషన్స్ తో లింక్ అప్ అయ్యే సాంగ్స్.  అందులో ఎమోషన్ ఎక్కువగా వుంటుంది.  ఇందలో చాలా మంచి ఎమోషనల్ సాంగ్ వుంది. ఆ పాట కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాను. అందులో సబ్జెక్ట్ వుంటుంది. సినిమా రిలీజ్ తర్వాత ఆ పాట లాంచ్ వుంటుంది.
-హరోం హర పాట కళ్యాణ్ చక్రవర్తి అద్భుతంగా రాశారు. ఆలాగే నారిని విడిచే పాట రాబోతుంది. ఈ పాటకు కూడా ఆయనే లిరిక్స్.  కనులెందుకో పాట వెంగీ చాలా ఛాలెంజింగ్ గా రాశారు. భరద్వాజ్, హర్ష చెరో పాట రాశారు. ఈ రెండు పాటలు కూడా వండర్ ఫుల్ గా వచ్చాయి.
సుధీర్ బాబు గారి సినిమాకి మ్యూజిక్ చేయడం ఎలా అనిపించింది ?
-సుధీర్ బాబు గారి డైనమిక్ యాక్టింగ్, ప్రజెన్స్, డైరెక్టర్ విజువల్ గా అద్భుతంగా హ్యాండిల్ చేసిన విధానం ఇన్ని ఫ్యాక్టర్స్ నాకు హెల్ప్ అవ్వడం వలనే నా నుంచి మ్యుజికాలిటీ ఆర్గానిక్ గా ట్రిగర్ అయ్యిందని నమ్ముతాను. ఈ మూవీలో ప్రతి క్యారెక్టరైజేష్ కి ఒక స్పెషిఫిక్ థీమ్ లా డెవలప్ చేసుకున్నాం.
హరోం హర నిర్మాతల సపోర్ట్ గురించి ?
-ఈ మూవీ మొత్తంలో ప్రొడ్యూసర్స్ కోర్ ఫ్రీడమ్ ఇచ్చారు. డైరెక్టర్ ఎలా అయితే నామీద నమ్మకం పెట్టారో అలాంటి నమ్మకం నిర్మాతల నుంచి వచ్చింది. ఒక కొత్త అటెంప్ట్ బయటికి రావడానికి చాలా హెల్ప్ చేశారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
గోపీచంద్ గారు, శ్రీను వైట్ల గారి విశ్వం సినిమాకి చేస్తున్నాను.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్