Thursday, December 12, 2024

సింగరేణి ప్రాంతంలో బొగ్గు అంబేద్కర్ బొమ్మ వద్ద సిపిఎం నిరసన

- Advertisement -

సింగరేణి ప్రాంతంలో బొగ్గు అంబేద్కర్ బొమ్మ వద్ద సిపిఎం నిరసన

భూపాలపల్లి
సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయరాదు
బొగ్గు బ్లాక్ లను సింగరేణికే  అప్పగించా లి సిపిఎం డిమాండ్
Cpm ఆధ్వర్యంలో ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర బొగ్గు బావుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, సింగరేణికే బొగ్గు బావులను కేటాయించాలని, సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయరాదని, బొగ్గు బావులను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఆపాలని, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సింగరేణి కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులువెలిశెట్టి రాజయ్య,గుర్రం దేవేందర్, ఆతుకూరి శ్రీకాంతు, మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ సర్కారు దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో ఉన్న 67 బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే వేలం పాటలు వేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని మందమర్రి ఏరియాలో ఉన్న శ్రావణ్ పెళ్లి కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి వేలం వేసింది. అతి వేలంపాటను వెంటనే నిలుపుదల చేయాలని, సింగరేణికి బొగ్గు బ్లాక్ లను అప్పగించాలని  డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రము నుండి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి  సింగరేణి రక్షణ కోసం అనేక దాపాలుగా సింగరేణి ప్రాంతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి  బొగ్గు శాఖ మంత్రి కాగానే బొగ్గు రంగంలో ఉండే బ్లాకులను ప్రైవేటు చేయడానికి కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి, వేలం పాటలు పెట్టడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కిషన్ రెడ్డి గారి పర్యటనలో బొగ్గని కార్మికులకు అనేక రకాల వాగ్దానాలు చేసిండు. ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా అమలు చేసినటువంటి చరిత్ర లేదు. మారు పేర్లు మారుస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని, ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని అనేక రకాల వాగ్దానాలు కిషన్ రెడ్డి గారు చేశారు. నెరవేర్చకపోగా బొగ్గు శాఖ మంత్రిగాగానే 67 బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వాళ్లకు అప్పగించిన ప్రయత్నం చేయటం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని సిఐటియు జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ నిలిపివేసి, బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి మీద ఆధారపడి అనేక కుటుంబాలు బతుకుతున్నాయని. బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం వలన కార్మికుల సంఖ్య కుదించబడుతుందని, కార్మికుల మీద ఆధార పడ్డటువంటి ప్రజల జీవనాధారం దెబ్బతింటుందని, సింగరేణి మనగడకే ప్రమాదమని అన్నారు. శిరుల వేణి సింగరేణి రక్షించుకుందాం. సింగరేణి రక్షణ కోసం సమరశీల పోరాటాలు చేద్దాం. కేంద్ర ప్రభుత్వ మెడలు ఉంచుదాం. బొగ్గు ప్లాకుల ప్రైవేటీకరణను ఆపేద్దాం. అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేద్దాం. బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలను కలిపి మోడీ సర్కారు ప్రభుత్వ మీద  సమరశీల పోరాటాలు నిర్వహిద్దామనిఅన్నారు. ప్రజలు ప్రజాసామిక వాదులు, విద్యార్థులు యువజనలు మేధావులు మహిళలు సకల జనులు మోడీ ప్రభుత్వ విధానాల్ని బొగ్గు రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా ఆఫీసు కారల్ మార్క్స్ కాలనీ నుండి అంబేద్కర్ బొమ్మ వరకు 300 మందితో భారీ ర్యాలీ సిపిఎం జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షతన జరిగింది. అనంతరం అంబేద్కర్ బొమ్మ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుమ్మరి రాజు,ఆకుదారి రమేష్, నూనెటి నరేష్, ఆతుకూరి శ్రీధర్,సిహెచ్ రవికుమార్, ప్రభాకర్,బాపు, సాంబయ్య, ప్రభాకర్, ఐద్వా   జిల్లా అధ్యక్షురాలు వంగాల లక్ష్మి, ఎన్ పి ఆర్ డి నాయకులు  గడప శేఖర్, మహేందర్తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్