ముఖ్యమంత్రి గారు ప్రభుత్వభూములు పదిలమేనా?*
*• జిల్లాలో ప్రభుత్వభూముల అరణ్యరోదన*
*• ఈ ప్రభుత్వంలోనైనా కబ్జాభూములు ‘చేతి’కొచ్చేన?*
*• కబ్జాదారుల మోచేతినీళ్లు తాగి వారికి వంతపాడుతున్న అధికారులు*
*• కబ్జాకు గురైన ప్రభుత్వభూములను బయటకుతీయాలంటున్న జిల్లావాసులు*
*వాయిస్ టుడే, వరంగల్ జిల్లా:* జిల్లాలోని ప్రభుత్వభూములు పదిలమేనా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు వరంగల్ జిల్లావాసులు. జిల్లాలో గత కొన్నిసంవత్సరాలుగా కబ్జాకు గురైన ప్రభుత్వభూములు, సీలింగ్, అసైన్డ్, శిఖం భూములు అరోణ్యరోదన చెందుతున్నాయి. ‘రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యాక గత ప్రభుత్వాలలో కబ్జాకు గురైన ప్రభుత్వభూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాము అన్న మాట మర్చిపోరు అనుకుంటున్నాం’. ప్రభుత్వభూములను కబ్జా చేస్తున్న భూబకాసురులు ఇన్నిరోజులుగా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరంటు రెచ్చిపోయి ప్రైవేట్ సర్వేనంబర్ లు వేసి వందల ఎకరాల ప్రభుత్వభూములు అన్యాక్రాంతంచేశారు. కబ్జాదారుల మోచేతి నీళ్లకు ఆశపడి కొంతమంది ప్రభుత్వ అధికారులు కబ్జాదారులకు, భూబకాసురలకు వందల ఎకరాల భూములను బంగారు పళ్లెంలో పెట్టి బహుమానంగా అందిస్తూ వంతపాడుతున్నారు. ఇన్నిరోజులుగా ఊపిరిబిగపట్టుకొని ఉన్న జిల్లావాసులు, భాధితుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కబ్జాకు గురైన భూములను వెలికితీసి కబ్జాదారుల కబందహస్తాల నుండి విముక్తి కలుగజేస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.