Tuesday, March 31, 2026

పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

- Advertisement -

పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

పెద్ద ఎత్తున పాల్గొన్న టిడిపి నాయకులు కార్యకర్తలు

తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు

బద్వేలు

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పించన్లను స్థానిక నాయకులు,మండల నాయకులతో కలసి టిడిపి సోమవారం పంపిణీ చేశారు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డులలో పింఛన్ పంపిణీ జరిగింది.ఈ సందర్భంగా బద్వేలు మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షుడు వెంగళరెడ్డి గ్రామీణ అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు నెలలక్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపి కూటమి పెద్దలు ఇచ్చిన వాగ్దానం మేరకు మాట తప్పకుండా ఏప్రిల్ ,మే,జూన్ నెలలో గత ప్రభుత్వం ఇచ్చిన 3వేల రూపాయలకు అదనంగా ప్రతినెల 1000 పెంచి జూలై నెలలో 7 వేల రూపాయల ప్రకారం ఇస్తామని చెప్పి నిలబెట్టుకున్న ఘనత సిఎం చంద్రబాబు కే దక్కిందన్నారు.ఎన్నికల మెనిపెస్టో లో కనపర్చిన ప్రతి అంశాన్ని అంచెలంచెలుగా అమలు పర్చి ప్రజలు మెచ్చిన ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని ఆయనన్నారు.18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1500 రూపాయలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిగ్ బాస్ లాయర్ ప్రసాద్ క
కె రవి కే రామకృష్ణ మహబూబ్ బాషా పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్