టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి…
తిరుమల, జూలై 1,
చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. పాలనాపరమైన నిర్ణయాలను శరవేగంగా తీసుకుంటున్నారు. నూతన నియామకాలను చేపడుతున్నారు. ఈ తరుణంలో టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని భావిస్తున్నారు. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తొలుత మెగా బ్రదర్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. కానీ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ నడిచింది. అయితే చంద్రబాబు ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి రేసులో టీవీ5 అధినేత బిఆర్ నాయుడు, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరికి చైర్మన్ పదవి ఖాయం చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో అధ్యక్ష పదవి భర్తీ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.తెలుగుదేశం పార్టీకి బలమైన మీడియా సపోర్ట్ గా టీవీ5 ఛానల్ నిలిచింది. అధినేత బిఆర్ నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటివరకు ఆ సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ పదవి దక్కలేదు. అందుకే ఆ సామాజిక వర్గానికి కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే నిన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చారని వైసీపీ పై ఒక రకమైన ప్రచారం నడిచింది. బి ఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి అప్పగిస్తే కమ్మ సామాజిక వర్గానికి పదవులంటూ వైసీపీ ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది. అందుకే బిసి నినాదం తెరపైకి వస్తోంది. కానీ ఇటీవలే టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ కు అప్పగించారు. అందుకే టీటీడీ అధ్యక్ష పదవిని కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తారని సమాచారం.మరోవైపు అశోక్ గజపతిరాజు పేరు కూడా వినిపిస్తోంది.క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇవ్వడం సముచితమని, హుందాతనమని, గౌరవించినట్లు అవుతుందని పార్టీ వర్గాల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటివరకు టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి అశోక్ రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కడం ఆనవాయితీగా వస్తోంది. 2014లో మాత్రం ఆయన ఎంపీగా పోటీ చేయడంతో ఎన్డీఏ ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ దక్కింది. ఆయనకు కీలక పదవి ఇవ్వనున్న నేపథ్యంలోనే ఆయన కుమార్తెకు క్యాబినెట్లోకి తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. పైగా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ హయాంలో అశోక్ గజపతిరాజు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో కీలక దేవస్థానాలకు ధర్మకర్తగా ఉండడంతో.. ఆయనకు టిటిడి అధ్యక్ష పదవి ఇస్తే సముచితమని పార్టీ వర్గాల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తెరపైకి అశోకగజపతి రాజు
ఏపీలో టీటీడీ చైర్మన్ పదవి మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఓ సీనియర్ నేతకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. తెలుగుదేశంలో కూడా బలమైన చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెగా బ్రదర్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. ఆయనను టీటీడీ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన పదవిపై ఆసక్తి చూపలేదని టాక్ నడిచింది. ఈసారి టిడిపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. స్పీకర్ ఎంపిక పూర్తి చేసి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నూతన నియామకాలతో పాటు పాలనపై దృష్టి పెట్టింది. అటు నామినేటెడ్ పోస్టుల విషయంలో సైతం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. కష్టపడిన వారికి పదవులు ఇస్తామని.. ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే టీటీడీ అధ్యక్ష పదవివిషయంలో ఒక క్లారిటీ వచ్చిందని.. సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు ఆ పదవి ఖాయమైందని సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం జరుగుతోంది.అశోక్ గజపతిరాజు టిడిపిలో సీనియర్.పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పక్క చూపులు చూడలేదు. ఇప్పటివరకు ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్ర క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కింది. ఒకసారి ఎంపీ అయిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 2014 యండి ఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకొని తన కుమార్తె అదితి గజపతిరాజుకు ఛాన్స్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెలుపొందింది.2024 ఎన్నికల తర్వాత అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండడంతో.. తెలుగుదేశం పార్టీకి బిజెపి రెండు గవర్నర్ పోస్టులు ఆఫర్ చేసిందని జోరుగా ప్రచారం సాగింది. కానీ అటు తర్వాత ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు పేరు బలంగా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు. విజయనగరం సంస్థానానికి వారసుడిగా, సింహాచలంతో పాటు రామతీర్థ ఆలయ ట్రస్టీగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో హుందాగా ఉంటారని ఆయనకు మంచి పేరు ఉంది. గత ఐదేళ్ల కాలంగా అశోక్ గజపతి రాజును వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది. అందుకే ఈసారి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి.. ఆయన గౌరవాన్ని పెంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.
టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి…
- Advertisement -
- Advertisement -