ఈడీ ముందు హజరయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

- Advertisement -

ఈడీ ముందు హజరయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
హైదరాబాద్
ఈడి ఎదుట హాజరైన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హజరయ్యారు.  మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు పాల్పడ్డారంటూ ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈ డి సోదాలు జరిపింది. రెండు రోజులపాటు మహిపాల్  ఇంట్లో ఈ డి అధికారులు సోదాలు నిర్వహించారు. 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఆరోపణ.  గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో పాటు సోదరుడి ఇంట్లో ఈడి సోదాలు జరిగింది.  మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టాలని ఆరోపణలు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. 39 కోట్ల రూపాయల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపణ.  మైనింగ్ లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్ తో పాటు వినామీ పేర్లతో వ్యాపారాలు జరిగాయి. సంగారెడ్డి పటాన్చెరువు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ సోదరుల మైనింగ్ నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular