జిల్లా నాయకత్వం మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం…
We will all work together as per the district leadership…
మనలో మనకు భేదభిప్రాయాలు వద్దు….
తెలియక అన్న మాటలను మేము వెనక్కి తీసుకుంటున్నాం…
మంత్రాలయం
జిల్లా నాయకత్వం మేరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని జనసేన నాయకులు లోకేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రమైన కోసిగిలోని స్థానిక ఎస్ సి కమ్యూనిటీ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాలుగు మండల నాయకులు అనుమేష్, రామాంజనేయులు, గణేష్, ఏసేబు, సత్య, వీరారెడ్డి,రమేష్, రాజు,హాజీ, మునిస్వామి మారెప్ప, తదితరులు మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి జనసేనలో కొంత అసంతృప్తి ఏర్పడింది. మా జనసేన నాయకులు లక్ష్మన్న పార్టీ ఆదేశాలు లేకుండా నియోజవర్గంలో మండల అధ్యక్ష కన్వీనర్లను నియమించారు. అందులో భాగంగా నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పార్టీ ఆదేశాలు లేకుండా మండల అధ్యక్ష కన్వీనర్లను ఎలా నియమిస్తావని హెచ్చరించడం జరిగింది. దానికి బదులుగా లక్ష్మన్న మా జనసేన నాయకులతో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయించారు. అది కాస్త పోలీస్ స్టేషన్ వరకు పోయింది. దానికి ఎస్ఐ గారు ఇరువర్గాలకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించి సర్ది చెప్పడం జరిగింది. ఎస్ఐ గారి ఆదేశాలను అనుసరిస్తూ మేము అందరం కలిసికట్టుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగా లోకేష్ మాట్లాడుతూ కొన్ని తెలియక చేసిన తప్పిదం వల్ల కొంతవరకు మా జనసేన నాయకులు ఇబ్బందులు పడ్డారు. కావున మేము కొన్ని అన్న మాటలను తప్పుగా భా విస్తూ వెనక్కి తీసుకుంటూ మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని వారన్నారు. అలాగే వీరారెడ్డి మాట్లాడుతూ లక్ష్మన్న చెప్పించడం ద్వారా నాకు తెలియక కొన్ని మాటలు అన్నాను దానికి మన జనసైనికులు అందరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తూ ఇప్పటినుంచి మనమందరం కలిసికట్టుగా ఉందామన్నారు. కావున మంత్రాలయం నియోజవర్గంలో జనసేన కార్యకర్తకు చేయపరిచేది ఏమంటే మన నియోజవర్గంలో జనసేన వర్గ పోరు వద్దు రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజవర్గంలో జనసేన ఇంచార్జి గా ఎవరిని నియమించిన మేమందరం కట్టుబడి ఉంటామని తెలియపరుస్తున్నాము. ఇంచార్జి ని నియమించిన తర్వాత మండల అధ్యక్ష కన్వీనర్లను ఎవరిని నియమించిన వారితో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, ఈరన్న ఆకాష్ శివలింగ ఉమేష్ ఈరన్న కేశవ్ సిద్దు అబ్దుల్ మల్లి మహబూబ్ దుర్గేష్ యోహాను ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.