సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
People should be alert for seasonal diseasesv:
– ఈ ఓ ఆర్ డి సందీప్
సి.బెళగల్
పారిశుద్ధ్యకార్యక్రమంలో భాగంగా ఈర్లదిన్నె ,కొండాపురం గ్రామాలను సందర్శించడమైనది.ఈర్లదిన్నె, కొండాపురం గ్రామాలలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించడమైనది. సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వ్యాధులు ప్రబలకుండగా మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ అలాగే స్ప్రేయింగ్ చేయించడం, పొగమందు కొట్టడం, డయేరియా ప్రబలకుండగా నీళ్ల ట్యాంకులు శుభ్రం చేయించడం, క్లోరినేషన్ చేయించడం ,వాటర్ టెస్టింగు చేయించడం ,ప్రజలకు ,స్కూల్ విద్యార్థులకు వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం. దండోరా ద్వారా మైకుల ద్వారా చెప్పించి ప్రజలకు చైతన్యవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు తెలియజేశారు. అదేవిధంగా కొత్తకోటలోని 2వ సచివాలయమును సందర్శించి సిబ్బందికి సమయపాలన కచ్చితంగా పాటించవలనని ఫీల్డ్ కు వెళ్ళేటప్పుడు కచ్చితంగా మూమెంట్రీస్ లో రాసి వెళ్లాలని సిబ్బందికి తెలియజేయడమైనది. గ్రామాలలో దోమల నివారణ కొరకు ఇండెంట్ పెట్టిన మేరకు జిల్లా పంచాయతీ ఆఫీసు నుండి బిప్లిక్స్ ఐకాన్ మందు రావడం జరిగిందని సదరు పంచాయతీలకు ఈ మందును పంపిణీ చేసి సకాలంలో దోమల నివారణ కొరకు గ్రామాలలో పిచికారి చేయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈర్లదిన్నె పంచాయతీ కార్యదర్శి సైఫ్ల బేగ్ ,రాజేష్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలంకృత ఇమ్మానుయేల్ పాల్గొన్నారు.



