- Advertisement -
ఏపీ సీఈసిగా వివేక్ యాదవ్
విజయవాడ
Vivek Yadav as AP CEC
ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివేక్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత..
ఆంధ్రప్రదేశ్ సీఈవో బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ రిలీవ్ కానున్నారు. అయితే, ఎంకే మీనాకు కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో
అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం విదితమే.. ఈ సమయంలో.. అనేక ఫిర్యాదులు ఆయన దృష్టికి వెళ్లాయి.. మరోవైపు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక అధికారులతో పాటు..
భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి.
- Advertisement -