విద్యార్థులు భవిష్యత్ టార్గెట్ నిర్దేశించుకోవాలి
– ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం,
Students should set future target
చదువుకునే సమయంలోనే విద్యార్థులు భవిష్యత్తులో తమ టార్గెట్ నిర్దేశించుకోవాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మాగంటి ఫంక్షన్ హాల్ లో ఆత్మబంధువులు ఏర్పాటుచేసిన శివశక్తి ఫౌండేషన్ టాలెంట్ టెస్ట్ బహుమతి ప్రధాన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వార్థం లేకుండా విద్యా వైద్య రంగాల్లో ఆత్మ బంధువుల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమాజంలో ఏమీ ఆశించకుండా పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించేది తల్లిదండ్రులు మాత్రమేనని ఆ తల్లితండ్రుల గౌరవాన్ని కాపాడే దిశగా మీరందరూ కృషి చేయాలి అన్నారు. ఆత్మ బంధువుల సభ్యుడు కొల్లనవాడ పెద్ద కృష్ణంరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఎంతమంది వచ్చినా ఉచిత వైద్యం అందించడం సామాన్యమైన విషయం కాదని కృష్ణంరాజు అభినందనీయులు అన్నారు. సైన్స్ కాంపిటీషన్లో మొదటి రెండవ బహుమతులు సెయింట్ ఆన్స్ విద్యాసంస్థకు చెందినకిరణ్ సాయి, స్నేహ శ్రీ, మూడో బహుమతి భాష్యం స్కూల్ కు చెందిన ప్రవీణలకు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందించారు.



