రైతుల గురించి ఆలోచించేదే కాంగ్రెస్ ప్రభుత్వం మే
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్,పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల,:
May the Congress government think about the farmers
రైతుల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.రాష్ట్ర రైతాంగానికి 1 లక్ష రూపాయాల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా వెల్లి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ , సిఎం రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మాజీమంత్రి ,ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ , మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి లు చిత్ర పటాలకు కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం. చేశారు.
ఈ సందర్భంగా క్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నెల ముందుగానే రైతులకు రుణమాఫీ అమలు చేస్తూ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు.ఈ పథకం ఫస్ట్ ఫేసులో లక్ష రూపాయల రుణాలను మాఫీ చేశారన్నారు.
అన్నం పెట్టే రైతులను అప్పుల ఊబి నుండి ఆశల సాగు వైపు నడిపించేందుకే ఈ రైతు రుణమాఫీ పథకం అమలు చేయడం జరిగిందన్నారు.ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు.ఇది తెలంగాణ చరిత్రలో రైతు సంక్షేమ అధ్యయనంగా నిలిచి పోతుందన్నారు.రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాలు చెప్పుకోవాలని గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ ,ఇందిరమ్మ ఇండ్ల, గురించి ఇప్పటికే చెప్పుకుంటున్నారని లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి లు గుర్తు చేశారు.ఈ దేశంలో అందరి కన్నా ఎక్కువ కష్టపడేది రైతే అని చెబుతూ వాళ్ళు పండించడం మానేస్తే మనకి చివరికి అన్నము కూడా దొరకదని, అలాంటి రైతులను గౌరవించాలల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం, ముస్కు ఎల్లారెడ్డి,కళ్లెపెళ్లి దుర్గయ్య, కొత్త మోహన్, బండ శంకర్, గాజుల రాజేందర్,
రమేష్ బాబు, రాధకిషన్, అంకతి గంగాధర్, జున్ను రాజేందర్,అల్లాల రమేష్ రావు, నేహల్,గుండా మధు,పరిక్షిత్ రెడ్డి,కౌన్సిలర్ నక్క జీవన్, హనుమండ్ల జయశ్రీ రఘు,ముంజల ఘువీర్ గౌడ్, ఎన్నం మధుకర్ రెడ్డి,రాజేష్,బొల్లి శేఖర్, పిప్పరి అనిత, గంగం రెడ్డి, కొప్పెర వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి, నేహాల్
కార్యకర్తలు, పాల్గొన్నారు


