మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సర్వీసులపై ప్రభావం పడింది. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టమ్‌లు షట్‌డౌన్ / రీస్టార్ట్ అయ్యాయి. క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ చేయడంతోనే సాంకేతిక సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించి సంస్థ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు.
‘‘నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్‌డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించాం. దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్‌తో కలిసి పనిచేస్తున్నాం. కస్టమర్లకు అవసరమైన సాంకేతిక సహాయం, మద్దతు సమకూర్చేలా, సిస్టమ్‌లను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని సత్య నాదెళ్ల ఎక్స్‌లో పోస్టు చేశారు. మరోవైపు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డ పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఈ చర్య ఆటోమోటివ్ సరఫరా గొలుసును దిగ్బంధించిందంటూ టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ‘మీ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి థర్డ్‌పార్టీని ఎలా అనుతిస్తారు’ అని ఓ యూజర్ ప్రశ్నించారు. 1999లో విండోస్‌లో నెలకొన్న సమస్యతో ప్రస్తుత దాన్ని పోల్చుతూ కేవలం రంగు, మెసేజ్ మాత్రమే మారింది. సమస్య మాత్రం అలాగే ఉంది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల్లో పలువురు మీమ్‌లతో విరుచుకుపడుతున్నారు.
మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సాంకేతిక సమస్య

- Advertisement -
- Advertisement -



