- Advertisement -
పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్… రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదు
There is no change in reservations
హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మోగనున్న ఎన్నికల నగారా! గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్g సిగ్నల్.పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సీఎం అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావొస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని అధికారులకు సూచించారు.
ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -