మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు అరెస్ట్
గన్నవరం
Former MLA Vallabhaneni Vamsi arrested
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు. గత కొన్ని రోజులుగా ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అమెరికా పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా వల్లభనేని వంశీని గన్నవరంలోని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. అనంతరం వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వల్లభనేని వంశీ కారును వెంబడించిన పోలీసులు. ఆయన ఇంటికి సమీపంలోకి రాగానే అరెస్ట్ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియడంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేప్టటారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో వల్లభనేని వంశీ అనుచరుడిది కీలక పాత్రగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు.
గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు 71వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది.