చేయని నేరానికి జైలు…జైలులోనే జీవితం చాలించిన నిర్దోషి
సిద్దిపేట
Jail for crime not committed
పోలీసుల తప్పిదంతో చేయని నేరానికి శిక్ష అనుభవించి జైల్లోనే చనిపోయిన వ్యక్తి ఉదంతం ఇది. సదరు వ్యక్తి మృతి చెందిన ఆరేళ్ళ తర్వాత నిర్దోషిగా హైకోర్టుప్రకటించింది. కోర్టులో కేసు వాదించిన న్యాయవాదులకు కూడా చనిపోయిన విషయం తెలవకపోవడం గమనార్హం. 2013 ఫిబ్రవరి 1న దుబ్బాక (మం) పెద్దగుండవెళ్లిలో సీతాఫలం చెట్టుకు ఎల్లవ్వ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుమారుడు పోషయ్యనే పోషించలేక చెట్టుకు ఉరి వేసి చంపాడని బంధువులు ఆరోపించారు. పోలీపులు పోషయ్య పై కేసునమోదు చేసారు. 2015 జనవరి 12న సిద్దిపేట ఆరో అదనపు సెషన్స్ కోర్టు పోషయ్యకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2015లో తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టుని పోషయ్య ఆశ్రయించాడు. పెరోల్ కి దరఖాస్తు చేసుకున్న పోషయ్యకి 2018 ఆగస్టు 15న పెరోల్ ఇచ్చిందికోర్టు.
2018 ఆగస్టు 15న పోషయ్య జైలు నుంచి విడుదల అవ్వాల్సి ఉండగా ఒక్కరోజు ముందు అనారోగ్యంతో చర్లపల్లి జైల్లో పోషయ్య మృతి చెందాడు. చివరకు హైకోర్టు 2024 జులై 25న పోషయ్యని నిర్దోషిగా తెలుస్తూ విడుదలకు ఆదేశించింది.