- Advertisement -
నేరడిగొండ మండలం బందం వద్ద తప్పిన పెను ప్రమాదం
అదిలాబాద్
Big risk missed
అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బందం దగ్గర పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై నిర్మల్ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు- లారీ ఢీ కొన్నాయి. బస్సు పూర్తిగా రోడ్డు దాటిన తరువాత లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం తప్పింది. సీసి కెమెరాలలో ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి. సీసి ఫుటేజ్ లో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు వున్నారు. ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. మహరాష్ట్ర లోని కిన్వట్ నుండి నిర్మల్ కు బస్సు వస్తుండగా ప్రమాదం జరిగింది.
- Advertisement -