Friday, March 27, 2026

 జగనన్న తోనే చేనేతల అభివృద్ధి సాధ్యం 

- Advertisement -

 జగనన్న తోనే చేనేతల అభివృద్ధి సాధ్యం 
చేనేతపురిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వైయస్ఆర్ సిపి
ఎమ్మిగనూరు

Handicraft development is possible only with Jagananna

జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్సిపి కార్యాలయంలో పద్మశ్రీ మాచని సోమప్ప చిత్రపటానికి పూలమాల సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు.శ్రీమతి బుట్టా రేణుక  జాతీయ చేనేతల దినోత్సవ సందర్భంగా  మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో చేనేత ప్రాంతాలు ఉన్న ఎమ్మిగనూరునకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకోచ్చిన ఘనత మా తాత గారు అయిన పద్మశ్రీ మాచని సోమప్ప గారికి చెందుతుందని మరియు రాష్ట్రం లోనే పేరుగాంచిన ధర్మవరానికి దిటుగా ఎమ్మిగనూరును అభివృద్ధి చేసి చేనేతపురిగా పేరు తీసుకోచ్చారు అని ఎమ్మిగనూరు కేంద్రంగా అనేక పరిశ్రమలు ఏర్పాటుచేసి వేల మందికి ఉపాధి కల్పించారు అందుకే ఎమ్మిగనూరు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో పద్మశ్రీ మాచని సోమప్ప గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికి ఎమ్మిగనూరు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు అని రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా బీసీలకు పెద్దపీట వేసింది మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే చేనెతపురిగా పేరుగాంచిన ఎమ్మిగనూరు నియోజకవర్గనికి 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారని అందుకే ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గనకు నేను పెద్దల సలహాల సూచనలతో నా వంతుగా అభివృద్ధికి తొడ్పాడుతారని  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యువ నాయకుల బుట్టా ప్రతుల్, మాజీ వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్, ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బి ఆర్ బసిరెడ్డి, మాజీ శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు,వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్,మాజీ ఎమ్మిగనూరు వివర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ బండా నాగరాజు,మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్లు  బి.ఎన్. నాగరాజు, యు.కే రాజశేఖర్,కౌన్సిలర్లు నాగేశప్ప, నీలకంఠ, ఎం.కె శివప్రసాద్,అంపమ్మ, శివన్న,విశ్వనాథ రమేష్, వెంకటాపురం బజారి, రుద్రాక్షల బజారి, పాల శ్రీనివాసరెడ్డి, యు కె వీరేంద్ర,కోటకొండ నరసింహులు,మహబూబ్ బేగ్, డిష్ రఫీ,వడ్డే వీరేష్, శ్రీరాములు, చంద్రశేఖర్, గోరవయ్య, కిబ్రియ,ఫయాజ్, గోనెగండ్ల టీచర్ మునెప్ప, చేనేత నాయకులు, వైయస్సార్సీపి  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్