టీటీడీలో పని చేస్తున్న 58 మందికి నోటీసులు…!!!

- Advertisement -
టీటీడీలో పలు విభాగాల్లో పని చేస్తున్న 58 మందికి నోటీసులు జారీ …!!!

Notices issued to 58 people working in various departments in TTD…!!!

తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు నెలలుగా సోదాలు చేస్తున్న అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలో పలు విభాగాల్లో పని చేస్తున్న 58 మందికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రూ. వేల కోట్ల నిధులను కేటాయించాయి. అయితే ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముడిసరుకుల కొనుగోలు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఏపీ ప్రభుత్వానికి, సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular