Monday, December 23, 2024

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం…

- Advertisement -

అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం…
కేసీఆర్ కు ఏఐసీసీ.. కేటీఆర్ కు పీసీసీ చీప్ ..కవితకు రాజ్యసభ సీటు ఖాయం..!
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Merger of BRS in Congress…

హైదరాబాద్
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం? బీఆర్ఎస్ ను వీలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వం,  ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా?
బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురదచల్లుతురా? కవిత బెయిల్ పై కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం, కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశం. కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం? ఆప్ పార్టీని వలీనం చేసుకుంటేనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ది కోసం  న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గం. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయం. ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం.  కేసీఆర్ ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ను పీసీసీ చీఫ్, హరీష్ రావుకు మంత్రి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయం. అంత ఉబలాటముంటే రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గతంలోనూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంతోపాటు మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్ ఫోన్ ట్యాపింగ్ సహా అనేక అవినీతి అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ సహా  బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీయే. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యం. నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల తీరు.
సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ లను జైలుకు పంపాలి. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్