మున్నూరు కాపు సంఘము అపెక్స్ కౌన్సిల్ గౌరవ చైర్మన్ గా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

Union Minister of State Bandi Sanjay as Honorary Chairman of Apex Council of Munnuru Kapu Sanghaజూబ్లీహిల్స్ : వాయిస్ టుడే
రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపులు సంఘాటితం కావాలని మున్నూరు కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మంత్రి బండి సంజయ్ ను కలిసిన అపెక్స్ కౌన్సిల్ సభ్యులు . ఒక కులం ఒకే సంఘం నినాదం తో మున్నూరు కాపులను ఐక్య పరిచే దిశ లో పనిచేస్తున్న అపెక్స్ కౌన్సిల్ సభ్యులను బండి బండి సంజయ్ ఆభినందించారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులు అపెక్స్ కౌన్సిల్ కు గౌరవ చైర్మన్ గా ఉండవలిసిందిగా కోరగా వారు ఒప్పు కున్నారు . బండి సంజయ్ మాట్లాడుతూ మున్నూరు కాపు లు చాల క్రమ శిక్షణ కలవారని కష్ట జీవులు అని మాట ఇస్తే కట్టుబడి ఉంటారని అన్నారు.పార్టీ లకు అతీతంగా సంఘము నడపాలని సంఘాలు సామాన్య మున్నూరు కాపు లకు అండగా ఉండాలి అని అన్నారు .సంజయ్ ని కలిసిన వారిలో అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పుటం పురుషోత్తమ రావు, అపెక్స్ కౌన్సిల్ కోర్ కమిటీ సభ్యులు సి విఠల్, రౌతు కనకయ్య, మీసాల చంద్రయ్య, సభ్యులు బుక్క వేణు గోపాల్,తుడి ప్రవీణ్,తూము రాజ్ కుమార్,ఆకుల రజిత్, మంగళరపు లక్ష్మణ్, కొత్త లక్ష్మన్ పటేల్ , చందు జనార్దన్, మామిళ్ళ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మని కొండా వెంకటేశ్వర్లు, పెన్ గ్రూప్ కోఆర్డినేటర్ పి యల్ ఎన్ పటేల్, మణికొండ రమేష్, కొండూరి వినోద్ తదితరులు కలిశారు




