బుజ్జి బొమ్మలు పంపిస్తాను ఆడుకో – నాగ్ అశ్విన్

- Advertisement -

బుజ్జి బొమ్మలు పంపిస్తాను ఆడుకో – నాగ్ అశ్విన్

I’ll send you toys, play – Nag Ashwin

కల్కి’లో ప్రభాస్ లుక్ జోకర్ లాగా ఉందని హిందీ నటుడు అర్షద్ వార్సి కామెంట్ చేయడంతో సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో దీనికి కౌంటర్ గా హీరోలు నాని, సిద్ధు జొన్నలగడ్డ , శర్వానంద్ తదితర తెలుగు నటులు ప్రభాస్ కి మరియు టాలివుడ్ కి సపోర్ట్ గా ట్వీట్ వేయడంతో ప్రస్తుతం ట్విటర్లో నార్త్-సౌత్ అనే రచ్చ అవుతోంది. ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించి మంట చల్లార్చే ప్రయత్నం ఈరోజు ట్విట్టర్ లో చేసాడు….. జూన్ లో విడుదల అయిన ‘కల్కి 2898 AD’ సినిమా క్లైమాక్స్లో ప్రభాస్, కర్ణుడిగా ఎంట్రీ ఇచ్చే సీన్ ని ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ నెటిజన్ ……బాలీవుడ్ మొత్తం కంటే ఇది బెటర్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు . దీనిపై స్పందించిన నాగ్ అశ్విన్.. ‘మళ్లీ పాతకాలంలోకి వెళ్లొద్దు. సౌత్ వర్సెస్ నార్త్, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనేవి లేవు. ఇప్పుడంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అర్షద్ సాబ్ మీరు కాస్త చూసుకుని మాట్లాడాల్సింది. కానీ ఓకే. మీ నలుగురు పిల్లలకు బుజ్జి (సినిమా రిఫరెన్స్) బొమ్మలు పంపిస్తున్నాను. అలానే కల్కి 2లో ప్రభాస్ మరింత బెస్ట్ గా కనిపిస్తాడు’ ఓ ట్వీట్ కీ రిప్లై ఇచ్చాడు. ‘ఇప్పటికే ప్రపంచం చాలా ద్వేషంతో నిండిపోయింది. మనం దాన్ని పెంచే పనిచేయొద్దు. నేనే కాదు ప్రభాస్ కూడా ఇలానే చెబుతాడు’ అని రెండవ ట్వీట్ లో నాగ్ అశ్విన్ రాసుకొచ్చాడు. మరో ట్విటర్ యూజర్…. అర్షద్ వార్సి కంటే బెస్ట్ యాక్టర్ సౌత్లో ఎవరైనా ఉన్నారా? అని పోస్ట్ పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన నాగ్ అశ్విన్.. ‘అసలు నువ్వు ఎవర్రా? ఇంత ద్వేషం ఎందుకు? ఇలా వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నావ్? అని కోపం తో ఊగిపోతూ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. మేమంతా ఒక్కటే. కావాలంటే బుజ్జి బొమ్మ ఒకటి పంపనా?’ అని సరకాస్టిక్ గా గొడవని ఎలాగో అలా చివర్లో చల్లార్చే ప్రయత్నం చేశాడు కల్కి డైరెక్టర్. ఇకపోతే ప్రస్తుతం కల్కి 2898AD సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. NETFLIX లో హిందీ వెర్షన్, అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం సహా ఇతర దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది. సినిమాలో అమితాబ్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. అలానే మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే గురువారం రోజున సంచలన లేఖ విడుదల చేశారు. ప్రభాస్ గురించి అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ గురించి CINETAA ప్రెసిడెంట్ శ్రీమతి పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశారు. ఆ లేఖలో అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని…..నటీనటులు తమ అభిప్రాయాలను తెలియజేసేముందు గౌరవంగా మాట్లాడాలని పేర్కొన్నారు. మాటలకు చాలా పవర్ ఉంటుంది. అవి వంతెనలను నిర్మించగలవు…. అలాగే చీలికలను సృష్టించగలవు. దురదృష్టవశాత్తు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రియులు, అభిమానులకు అనవసరమైన నెగిటివిటీని తీసుకువచ్చింది. సినిమా సంఘంలో ఐక్యత, గౌరవం కోసం ఎల్లప్పుడూ నిలబడే CINETAA భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి అంటూ లేఖలో పేర్కొ్న్నారు మంచు విష్ణు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular