Wednesday, April 1, 2026

2 లక్షలు పై బడి ఉన్న రుణం కి కట్ ఆఫ్ డేట్ త్వరలో..

- Advertisement -

2 లక్షలు పై బడి ఉన్న రుణం కి కట్ ఆఫ్ డేట్ త్వరలో..
Cut off date for farmer loan above 2 lakh soon..

కాంగ్రెస్ పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీపై త్వరలోనే కటాఫ్‌ తేదీని ప్రకటిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై రుణాన్ని చెల్లించిన తరువాత మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు.

మరో 1.24 లక్షల మంది ఆధార్‌లో తప్పులు ఉన్నాయి.

18 వేల కోట్లు చేశాం….12 వేల కోట్లు చేయాల్సివుంది.

దశలవారీగా 2 లక్షల పైన మాఫీ.

రేషన్‌కార్డు ప్రామాణికం కాదు: మంత్రి పొంగులేటి.

కుటుంబం నిర్ధారణ కాని 4.24 లక్షల మంది కోసం ప్రత్యేక యాప్‌.

రాష్ట్రంలో రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై ఉన్న రుణాన్ని చెల్లించిన తరువాత మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ…. రుణమాఫీకి రేషన్‌కార్డు మాత్రమే ప్రామాణికం కాదని, తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేశారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నంలో ఎక్కడైనా అధికారులు తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, ఇంకా రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి వుంది అని తెలిపారు. రూ.2 లక్షలకు పైబడిన రుణమాఫీకి నెలలో గాని,రెండు నెలలోగాని కటాఫ్‌ తేదీ పెట్టి, రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే వారి ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని వివరించారు.

ఈ నిబంధన ఎందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు మంత్రి నీ ప్రశ్నించగా, రైతులకు రుణమాఫీ తర్వాత మళ్లీ లోన్‌ రావాలంటే పూర్తిగా రుణం మాఫీ కావాల్సిన అవసరం ఉందని తెలిపారు .అందుకే రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణం రైతులు చెల్లిస్తే వారికి మొత్తం మాఫీ అయి, తర్వాత మళ్లీ రుణం వస్తుందని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల రూ.2 లక్షల వరకు రుణం ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ కాలేదనే విషయం వాస్తవమని, వారికి కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసి తీరుతామని. అందుకు ప్రభుత్వము కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్