అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు డాక్టర్ మృతి..!!!

- Advertisement -

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు డాక్టర్ మృతి..!!!

A Telugu doctor died in the shooting in America..!!!
డాక్టర్ మృతి చెందాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌ బాబు (64) దుండగుడు జరిపిన కాల్పుల్లో చినిపోయాడు. అమెరికాలో పలు ఆస్పత్రులు నిర్మించి సేవలందిస్తున్నారు రమేష్ బాబు. ఆమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయి మంచి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా నుంచి ఆమెరికాకు వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చేవారు రమేష్ బాబు. రమేశ్‌ బాబు సేవలకు గుర్తింపుగా అక్కడ ఓవీధికి ఆయన పేరు పెట్టారు. ఈయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తాను చదువుకున్న ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షల విరాళమిచ్చారు. అంతేకాకుండా స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు కూడా అందించారు. ఆగస్టు 15న నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గన్న ఆయన.. అంతలోనే మఅతి చెందారన్న వార్త కుటుంబసభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రమేశ్‌ బాబు తల్లి, సోదరుడు నాయుడుపేటలో నివాసముంటున్నారు. వీరంతా అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular