Sunday, April 19, 2026

కుప్పకూలిపోనున్న ఇంధన ధరలు – విండ్‌ఫాల్ టాక్స్

- Advertisement -
కుప్పకూలిపోనున్న ఇంధన ధరలు – విండ్‌ఫాల్ టాక్స్
Collapsing fuel prices - windfall tax

లోక్ సభ ఎన్నికల సమయంలో కేంద్రం లీటర్‌పై రూ. 2 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. ఇక ఆయిల్ కంపెనీల విషయానికి వస్తే రెండు సంవత్సరాలుగా రేట్లను అసలు కదిలించట్లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంధన ధరలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో 2 వారాల తిరగగానే కనిష్టానికి దిగొచ్చాయి. దీనికి అసలు కారణాలేంటో ఇప్పుడు మనం తెల్సుకుందాం…….

కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయంగా అసంపూర్ణ    సంకేతాలు, ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం, అమెరికా చైనా ట్రేడ్ వార్, బంగ్లాదేశ్‌లో సంక్షోభం…. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాల వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని బిక్కు బిక్కు మంటూ పడిపోయాయి. ఈ కారణం వల్లనే కొన్నాళ్లుగా బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటం…. ఇంధన ధరలు పెరగడం వంటివి జరిగాయి. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న క్రూడాయిల్ రేట్లు పడిపోవటం ప్రారంభమవుతున్నాయి. మంగళవారం రోజు కూడా పడిపోగా….ఇప్పుడు 2 వారాల కనిష్ట స్థాయికి చమురు రేట్లు దిగొచేశాయి…. ముఖ్యంగా   మిడిల్ ఈస్ట్ దేశాల ఉద్రిక్తతలు, పరిస్థితులు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు అందడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు . గాజా ఇజ్రాయెల్ పై కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం. అలానే పరిష్కారం దిశగా చర్చల ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించడంతో మరింత బలం చేకూరింది.

దీనికి తోడు చైనాలో ఆర్థిక వ్యవస్థ బలహీనత కూడా ఆ దేశంలో ఫ్యూయెల్ డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది. భారత్‌తో పాటు చైనా ప్రపంచంలోనే క్రూడాయిల్ వినియోగంలో ముందువరుసలో ఉంటుందని. అందుకే ఈ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఇంధన రేట్లు పడిపోతున్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే గనుక ఈ చమురు ధరలు ఇవాళ మరికాస్త పడిపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు నిపుణులు చెబుతున్నది ఏమనగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో యూఎస్ క్రూడ్ స్టాక్స్ గత 8 వారాలుగా క్రమంగా పడిపోతూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న క్రమంలో. భారత ప్రభుత్వం విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించడం గమనార్హం.

ఇదిలా ఉండగా దేశీయంగా చమురును వెలికితీసి పెట్రోల్ మరియు పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్, ఏటీఎఫ్ రూపంలో విదేశాలకు ఎగుమతి చేసే దేశీయ ఆయిల్ కంపెనీలపై కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ వసూలు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇది గతంలో టన్నుకు రూ. 4600 గా ఉండగా…. దాదాపు సగానికిపైగా తగ్గించి రూ. 2100 కి తీసుకొని వచ్చింది. ముందుముందు రేట్లు పడిపోతే దీనిని ఇంకా తగ్గించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు పడిపోతున్న క్రమంలో.. ఇలాగే కొనసాగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం సవరించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా రేట్లు ఒకేవిధంగా స్థిరంగా ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రమే లీటర్ మీద రూ. 2 చొప్పున తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ రూ. 107.41 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ. 95.65 వద్ద ఉంది.12:03 PM

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్