Thursday, April 30, 2026

మొబైల్ ఫోన్ బ్లూ లైటుకి నిద్ర కి సంబంధం ఏమిటి….?

- Advertisement -

మొబైల్ ఫోన్ బ్లూ లైటుకి నిద్ర కి సంబంధం ఏమిటి….?

What is the relationship between mobile phone blue light and sleep?

రాత్రంతా కంటిమీద కునుకు లేదు’- ఇలా చాలా సందర్భాల్లో మన స్నేహితులు గాని పక్కింటి వాళ్ళు గాని అంటూ ఉంటారు . చాలా మంది రాత్రి వేళల్లో నిద్ర పట్టక ఉక్కిరి బిక్కిరి అవ్తుంటారు. కానీ రాత్రి వేళల్లో ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను, ట్యాబ్, టీవీ చూస్తూ ఉండడం వల్ల నిద్ర దూరమవుతుందని నిపుణులు అంటుంటారు . ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్స్ నుంచి వచ్చే నీలిరంగు కాంతి మనకు నిద్ర పట్టకుండా చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకు నిద్ర వేళకు ముందు బెడ్‌రూమ్‌లో ఫోన్‌ వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు . అయితే చాలా ఫోన్‌ కంపెనీలు కళ్లు (eyes) దెబ్బ తినకుండా ఉండేందుకు తమ ఫోన్లలో నైట్ మోడ్‌ అనే ఆప్షన్ ఉంటుంది. అయితే నిజంగానే బ్లూ రేస్‌ వల్ల మనకు నిద్ర దూరమవుతుందా? దీని గురించి సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.

స్వీడన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌కు చెందిన స్లీప్‌ ఎక్స్పర్ట్‌ బృందం దీనిపై పరిశోధనలు చేసింది. ఈ స్టడీస్ లొ ఆసక్తికర ఫలితాలు తెల్సుకున్నారు . ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ స్క్రీన్స్ నుంచి వచ్చే బ్లూ రేస్ వల్ల సగటున మూడు నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే నిద్రకు భంగం కలుగుతుందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని ఎక్సపెర్ట్స్ చాలా ఛాలెంజింగ్ గా తీస్కొని చేసారు . అన్ని వయసుల్లో ఉన్న లక్ష 13,370 మందిని పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు. అయితే మొబైల్ ఫోన్లు,లాప్టాప్, వినియోగానికి, నిద్రకు మధ్య సంబంధం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

రాత్రి పడుకోవడానికి ముందు బ్లూ రేస్ విడుదల చేసే స్క్రీన్‌ను చూసిన వ్యక్తులు సగటున 2.7 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయారు. అలానే కొన్ని అధ్యయనాలలో ప్రకాశవంతమైన స్క్రీన్‌ను ఉపయోగించిన తర్వాత బాగా నిద్రపోతారని అని చెప్పడం గమానర్హం. విచిత్రంగా వీడియో గేమ్‌లతో పోలిస్తే టీవీ చూసే వారిలో 3.5 నిమిషాలు ఎక్కువగా నిద్రను కోల్పోయారు అని అధ్యయనం లో తేలింది. అయితే చాటింగ్ చేసే వారు మాత్రం రాత్రి నిద్రకు దూరమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

నిద్రను ప్రభావితం చేస్తుందా….?

బ్లూ రేస్ లో మెలటోనిన్, నిద్రను నియంత్రించే హార్మోన్ ఉంటుంది. పగటిపూట అధిక మొత్తంలో సహజ కాంతికి గురవుతాము. ఈ ప్రకాశవంతమైన నీలిరంగు కాంతి మన కళ్ల వెనుక భాగంలోని కొన్ని కణాలను ఉత్తేజం చేస్తుంది. ఇది జాగ్రత్త పడాల్సిన సమయమని మన మెదడుకు సంకేతాలను పంపిస్తుంది. కానీ రాత్రిపూట కాంతి తగ్గినప్పుడు, మన మెదడు మెలటోనిన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభం అవ్తుంది. ఇది మనం నిద్రపోయేలా మెదడు కి సంకేతాలు ఇచ్చి నిద్రపోయేలాగా చేస్తుంది. మొబైల్ ఫోన్, లాప్టాప్ నుంచి వచ్చే కృత్రిమ కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుందని, మన నిద్రను డిస్టర్బ్ చేస్తుందని అనుకోవడం అంతా ఒక భావన అని తేలింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్