స్క్రాప్ కారు కొట్టు కొత్త కారు పై డిస్కౌంట్ పట్టు
Get a discount on a scrap car and a new carప్రతి మనిషి జీవితంలో సొంత కారు లేదా ఏదైనా వాహనం కొనుక్కోవాలి అని ఆశ పడుతుంటాడు. తన కుటుంబంతో కారు లో షికారు చేయాలి అని టూర్ లు వెయ్యాలి అని కల కంటుంటాడు….. దిగువ,మధ్య, ఎగువ అనే తేడా లేకుండా ఎవరికి అయినా కారు లేదా ఇతర వాహనం కొనాలి అని ఆసక్తి ఎందుకు ఉండదు చెప్పండి…..ఇవన్నీ ఎందుకు చెప్పుతున్న అనుకుంటున్నారా….? కేంద్ర ప్రభుత్వం వాహనాలు, కార్లు కొనే వారికి గొప్ప శుభవార్త చెప్పింది….. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. డిస్కౌంట్ పొందేందుకు ఎలాంటి ప్రోసెస్ ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుందాం……
కొత్త కారు లేదా ఏదైనా కమెర్షియల్ వెహికల్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది. కొత్త కారు గానీ ఏదైనా వెహికల్ పై భారీ డిస్కౌంట్ ని పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. అదేంటి అంటే కమెర్షియల్ మరియు ప్యాసెంజర్ వెహికల్ తయారీ కంపెనీలు కొత్త వాహనల విక్రయాలపై భారీ డిస్కౌంట్ కల్పించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అయితే, అందుకు ఓ టెర్మ్స్ అండ్ కండీషన్ కూడా ఉందని చెప్పారు. కొనుగోలు చేసే వారి దగ్గర ఉన్న పాత వాహనాన్ని తుక్కుకు సమర్పించి వాలిడ్ డిపాజిట్ సర్టిఫికెట్ ఉన్న వారికి కంపెనీలు డిస్కౌంట్ ఇస్తాయని ఇటీవలే మంత్రి తెలిపారు. దాదాపు అన్ని కంపెనీలు స్క్రాప్ పాలసీకి అంగీకరించాయన్నారు. అంటే మీరు పాత కారును స్క్రాప్ కి అప్పగించి సర్టిఫికెట్ తీసుకుంటే కొత్త వాహనంపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు అన్నమాట……
అయితే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పరిశ్రమల సమాఖ్యా మండలి సియామ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ యెుక్క మీటింగ్ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్స్ లో ఎదురుకుంటున్న వివిధ రకాల సమస్యలను విధి విధానాలపై చర్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా భారత్ దేశం మొత్తంలో 1000 కిపైగా వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాలు, 400 లకుపైగా ఆటోమెటెడ్ ఫిట్‌నెస్ టెస్ సెంటర్లు అవసరమని గత మీటింగ్ లో మంత్రి పేర్కొన్న విషయం తెలిసిందే…..
నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది వాటాదారులందరికి లాభదాయకంగా ఉంటుందన్నారు. అతిపెద్ద స్క్రాపింగ్ హబ్ గా భారత్ దక్షిణ ఆసియా లోనే మొదటి స్థానం లో నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు…. ఇలా చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా యువత కి వుంటుంది అని కేంద్రమంత్రి తెలిపారు.




