కుప్పంలో యానాదుల ఆందోళన

- Advertisement -

కుప్పంలో యానాదుల ఆందోళన

Yanadi Worry Kuppam

కుప్పం
చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, దాసేగౌనూరు పంచాయతీ యానాది గుట్టలో 30 కుటుంబాల యానాదులు నివసిస్తున్నారు.  పక్కా ఇండ్లు లేక పూరి గుడిసెల్లోనే 30 ఏళ్ళుగా ఉంటున్నామని, కనీస సౌకర్యాలు లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని యానాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  గత వైసిపి హయాంలో పెన్షన్లు పక్కా ఇండ్లు ప్రభుత్వ పథకాలకు అర్జీలు ఇచ్చినా తమను పట్టించుకున్న నాధుడే లేదని, ప్రస్తుత సీఎం చంద్రబాబు తమ గోడును పట్టించుకుని తమను ఆదుకోవాలని యానాదులు వేడుకుంటున్నారు.  కొందరికి ఆధార్ కార్డులు, మరికొందరికి రేషన్ కార్డులు ఉన్నా ఏ ఒక్క ప్రభుత్వ పథకం అందడం లేదని యానాదులు వాపోతున్నారు.  కొందరికి ఓటర్ కార్డులు ఉండటంతో ఎలక్షన్ సమయంలో మాత్రం రాజకీయ నాయకులకు గుర్తుకు వస్తున్నామే కాని తమ బాగోగులు చూడటానికి ఏ ప్రజా ప్రతినిధులు, అధికారులు రావడం లేదని నిస్సాహయత వ్యక్తం చేశారు. కనీసం గ్రామంలో మంచినీరు కూడా సరఫరా చేయడం లేదని యానాది మహిళలు వారి బాదను వెల్లగక్కారు. అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్లు మంజూరు కాకపోవడం ఏమిటని యానాది వృద్దులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular