శ్రీకాళహస్తి వన మహోత్సవం

- Advertisement -

శ్రీకాళహస్తి వన మహోత్సవం

Srikalahasti Vana Mahotsavam

తిరుపతి
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వన మహోత్సవం  కార్యక్రమాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు అటవీ శాఖ అధికారులు విద్యార్థులు సంయుక్తంగా చెట్లు నాటారు. ప్రతి ఒక్కరం చెట్లునాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని శ్రీకాళహస్తి ఫారెస్ట్ డివిజన్ అధికారి జ్ఞాన ప్రకాష్, టిడిపి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ పిలుపునిచ్చారు.
ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులు అధ్యాపకులు సంయుక్తంగా కలిసి చెట్లు నాటే కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. డివిజనల్ ఫారెస్ట్ అధికారి జ్ఞాన ప్రకాష్ మాట్లాడుతూ పర్యావరణం సమతుల్యాన్ని కాపాడుకోవడానికి మనం బాధ్యతగా  చెట్లు నాటుకోవాలని పిలుపునిచ్చారు. వన  మహోత్సవంలో భాగస్వామ్యం అవుదామన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular