రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి.

- Advertisement -

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి.

Make the blood donation camp a success.
అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు

తాడేపల్లిగూడెం.,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాదులోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆయన  ఒక వీడియో విడుదల చేశారు.తాడేపల్లిగూడెం అభిమానులతో పాటు జన సైనికులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా అభిమానులు అందరూ పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని మెగాస్టార్ చిరంజీవి  నినాదాన్ని  అందరూ పాటించి మెగా కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మీరు చేసే ఈ కార్యక్రమం ఆయనకు పుట్టినరోజుకు కానుక కానుంది అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular