ఎన్టీఆర్ భరోసాతో పేదల కళ్ళల్లో ఆనందం

- Advertisement -

ఎన్టీఆర్ భరోసాతో పేదల కళ్ళల్లో ఆనందం

Happiness in the eyes of the poor with NTR's Barosa

తాడేపల్లిగూడెం,
ఎన్టీఆర్ భరోసా తీసుకున్న ప్రతి ఒక్క పేద కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసిందని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ వలవల బాబ్జి అన్నారు.స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మి పేటలో ప్రతి నెల మొదటి తారీఖున ఇచ్చే పింఛను  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం 1వ తేది ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా శనివారమే పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బాబ్జి మాట్లాడుతూ  ఎన్టీఆర్ భరోసా తీసుకున్న లబ్ధిదారులు ఎన్నడు లేని సంతోషాన్ని పొందుతున్నారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి వల్లే సాధ్యమైందన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ,తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్, మురళీకృష్ణ గారు, 19వ వార్డు శానిటరీ సెక్రటరీ సోని, 19వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ బోజంకి శ్రీనివాస్ , పెద్దింటి రాజేష్ ,జనసేన పార్టీ  సజ్జా సుబ్బు, సీతారామయ్య  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular