- Advertisement -
తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన జూనియర్ ఎన్టీఆర్
Junior NTR fulfilled his mother's long-time wishAug 31, 2024,
తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ NTR తన తల్లితో కలిసి ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను Xలో షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు. ‘అమ్మ తన సొంతూరు కుందాపురానికి వెళ్లి, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్దామని నన్ను అడుగుతుంటుంది. ఇప్పుడు ఆమె కల నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టిన రోజుకు నేను ఇచ్చే మంచి బహుమతి ఇదే. నా ప్రియమిత్రులు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టిలతో కలిసి రావడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
- Advertisement -




