- Advertisement -
మమ్మల్ని కాపాడండి మహా ప్రభో
Please Save us Lord...
విద్యుత్ శాఖ అధికారులకు కాసిపేట ప్రజల మొర
గ్రామ నడి ఒడ్డున కంచలేని ట్రాన్స్ఫార్మర్
గ్రామంలో పొంచి ఉన్న పెను ప్రమాదం
అధికారులు స్పందించకుంటే పెను ప్రమాదం తప్పదు
తాండూర్
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామపంచాయతీ కేంద్రమైన కాసిపేట గ్రామ నడి ఒడ్డున కంచలేని ట్రాన్స్ఫార్మర్ తో పెను ప్రమాదం పొంచి ఉండటం చేత మమ్మల్ని కాపాడండి మహాప్రబో అంటూ కాసిపేట గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఇదే సమస్యను విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నప్పటికీ తమకేమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారని సదరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కంచలేని ట్రాన్స్ఫార్మర్ మూడు రోడ్ల కలయిక జంక్షన్ వద్ద ఉండడంతో ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి కింద పిల్లర్లకు బదులు సిమెంట్ గాజులను పెట్టడంతో అవి సైతం నేడు కురుస్తున్న వర్షాలకు కృంగి కూలిపోయే దశకు చేరుకున్నాయి. విద్యుత్ ఉన్న సమయంలో సదరు ట్రాన్స్ఫార్మర్ కూలి పాదాచారులపై,వాహనాలపై పడితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా కృంగిపోతున్న సిమెంట్ గాజులకు కర్రలను అడ్డుపెట్టి తాత్కాలిక నష్ట నివారణ చర్యలు తీసుకోవడం కనిపిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే అట్టి ట్రాన్స్ఫార్మర్ కు పటిష్టమైన పిల్లర్ ను నిర్మించి, చుట్టూరా కంచెను ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
- Advertisement -