- Advertisement -
ఉప్పలూరులో మురుగునీరు
Sewage in Uppalurపెనమలూరు
కంకిపాడు మండలం ఉప్పలూరు వద్ద బుడమేరు కట్ట తెగటంతో గ్రామంలోకి మురుగునీరు ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ప్రజల ఎవరిని నీటిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. అదేవిధంగా మంతెన గ్రామంలోని 18 నివాసాలు నీటి ముంపు గురవడంతో నిర్వాసితులను స్థానిక ఎంపీపీ పాఠశాలలో నివాసం కల్పించారు. అదేవిధంగా పెద పులిపాక, యనమలకుదురు గ్రామాల్లోని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్వాసితులకు పునరావసాలు కల్పించారు . ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆదేశాలతో టిడిపి కార్యకర్తల నాయకులు కలిసి రక్షణ చర్యలు చేపట్టారు.
నియోజకవర్గంలోని సుమారు 15 వేల ఎకరాలు నీటి ముంపుకు గురయ్యాయి ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు ముంపు గురైన పొలాల వివరాలను సేకరిస్తున్నారు.
- Advertisement -




