రక్తదాన శిబిరం ఊహించిన దాని కంటే విజయవంతమైంది
Blood donation camp was more successful than expectedబొలిశెట్టి తనయుడు రాజేష్
తాడేపల్లిగూడెం,
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్ పేర్కొన్నారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే నినాదంతో చేసిన ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం లోని జన సైనికులతో పాటు తెలుగుదేశం బిజెపి కార్యకర్తలు నాయకులు సైతం ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారనిఅన్నారు. వివిధ కళాశాలలు పాఠశాలలకు సంబంధించిన యువతతో పాటు మహిళలు యువతులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం ఆదర్శనీయమన్నారు. సుమారు వెయ్యి మందితో రక్తదానం చేయించాలనే తపనతో ప్రారంభించిన ఈ కార్యక్రమం వెయ్యి మందిని దాట వచ్చిననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వలవల బాబ్జి పాల్గొని రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జి మాట్లాడుతూ మెగా కుటుంబం నటులుగానే కాకుండా సామాజిక సేవలో ఎప్పుడు ముందుంటారని అందులో పవన్ కళ్యాణ్ అభిమానులు ముందు వరుసలో ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు రక్తదానం చేశారు. వివిధ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు రక్తదానం చేసి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.




