- Advertisement -
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పరవాడలో గ్రీన్ ఆంధ్ర- క్లీన్ ఆంధ్ర
Green Andhra- Clean Andhra in Paravada on the occasion of Pawan Kalyan's birthday– ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పంచకర్ల
పరవాడ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పరవాడ గ్రామంలో క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర అను కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని పరవాడ జూనియర్ కళాశాల ఆవరణలో స్వదేశీ జాతి మొక్కలు నాటడం జరిగింది. తరువాత పరవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు పైల జగన్నాధ రావు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, పంచకర్ల మణికంఠ, వియ్యపు చిన్న, సర్పంచులు కన్నూరు వెంకటరమణ, మోటూరు సన్యాసినాయుడు, కల్పన రాజశేఖర్ కూటమి నాయుకులు పైల రామచంద్రరావు, రెడ్డి శ్రీనివాసరావు, పెద్దిశెట్టి సత్య రావు, కుండ్రపు సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




