ప్రజలకు త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం
We will take steps to provide drinking water to the people కళ్ళెదుటే నీరు ఉన్నా వాడుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు….
ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
రుద్రవరం,
సి పి డబ్ల్యూ శ్రీరంగాపురం సమ్మర్ స్టోరేజ్ నుండి సమీప గ్రామాల ప్రజలకు త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామం వద్ద ఉన్న సిపిడబ్ల్యు శ్రీరంగాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సోమవారం ఆమె పరిశీలించారు. త్రాగునీరు సరఫరా చేసేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సంబంధించిన సమస్యలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిపిడబ్ల్యు శ్రీరంగాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి త్రాగునీరు సరఫరా కావడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. దీంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించడం జరిగిందని ఈ ట్యాంకు ద్వారా 8 గ్రామాలకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ట్యాంకు లైనింగ్ పనులకు సంబంధించి పనులు చేయించేందుకు నివేదికలు సిద్ధం చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించామన్నారు. ఈ సమస్యపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిధులు విడుదల చేయించి త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవడమే కాకుండా వీలైనంత త్వరగా గ్రామాలకు త్రాగునీరు సరఫరా అందిస్తామని ఆమె తెలిపారు. మండలంలో తెలుగు గంగ ప్రధాన కాలువ ఆధారంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారని కళ్ళముందే నీళ్లు ప్రవహిస్తున్న సాగు చేసిన పంటలకు వాడుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారని తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సమస్యతోపాటు రైతుల సమస్యలను పరిష్కరించేందుకే ఆర్డబ్ల్యూఎస్ ఎంఐ టిజిపి అధికారులను తీసుకురావడం జరిగిందని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ తెలుగు గంగ ప్రధాన కాలువ ద్వారా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు నీళ్లు తీసుకుపోయే తొందరలో స్థానికంగా ఉన్న రైతులకు సాగునీరు అందుతుందా లేదా అని పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ ప్రాంతంలో రైతులకు సాగునీరు అందించడమే కాకుండా చెరువులను కూడా నింపాల్చి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎంఐ టిజిపి ఆయా శాఖల అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




