రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలి

- Advertisement -

రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలి

Farmers must register the crop

రుద్రవరం,
ఖరీఫ్ సీజన్లో పంటలు సాగుచేసిన రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని తహసిల్దార్ మల్లికార్జునరావు వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ తెలిపారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఈపంట నమోదు పై గ్రామ రెవెన్యూ అధికారులు రైతు సేవ కేంద్రాల సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రుద్రవరం మండలంలో 21 500 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 10 500 ఎకరాలలో ఎకరాలు పంట నమోదు చేయించడం జరిగిందని తెలిపారు. పంట సాగు చేసిన ప్రతి రైతు పట్టణములో చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సేవా కేంద్రాల సిబ్బందికి సూచించామన్నారు. పంట సాగు చేసిన ప్రతి రైతు సేవ కేంద్రాల సిబ్బందిని కలిసి తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాల్సిందిగా రైతులను కోరారు. ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారులు రైతుసేవ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular