Monday, December 23, 2024

 లిక్కర్ మాల్ లెక్కలు తీస్తున్నారు…

- Advertisement -

లిక్కర్ మాల్ లెక్కలు తీస్తున్నారు…

Liquor Mall is calculating...

హైదరాబాద్, సెప్టెంబర్ 3, (న్యూస్ పల్స్)
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టానిక్ లిక్కర్ మాల్‌ను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. ఆ మాల్ లైసెన్స్ గడువు ముగియటంతో మాల్‌ను మూసేశారు. పొడిగించేందుకు మాల్ నిర్వహకులు అర్జీ పెట్టుకున్నా… అధికారులు నిరాకరించారు. గత ప్రభుత్వం హయంలో ఈ లిక్కర్ మాల్ కోసం అనేక రాయితీలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ టానిక్ చైన్ బీఆర్ఎస్ ఫ్యామిలీలోని ఓ కీలక సభ్యుడి బినామీ సంస్థ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్ మూసివేత చర్చనీయాంశంగా మారింది.తెలంగాణలో 2016 అక్టోబరు 26న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలైట్‌ షాప్‌ రూల్స్‌-2016 పేరుతో ఓ జీవో తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం ఏర్పాటయ్యే మద్యం దుకాణాల్లో ఫారెన్‌ వైన్‌, ఫారెన్‌ లిక్కర్‌, ఫారెన్‌ బీరుతో పాటు ఇండియన్‌ మేడ్‌ ప్రీమియం లిక్కర్‌, వైన్‌లు అమ్ముకోవచ్చునని జీవోలో స్పష్టం చేశారు. టానిక్‌ మద్యం దుకాణానికి విదేశాల నుంచి మద్యం దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ, ఆ సరకును టీఎస్‌బీసీఎల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అక్కడ లేబులింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే 70 శాతం వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ టానిక్‌ మద్యం దుకాణానికి ఎలైట్‌ షాపు పేరుతో ఇచ్చిన జీవోలో దుకాణం నిర్వహకులకు అనుకూలంగా అనేక వెసులుబాట్లు కల్పించారు.జూబ్లీహిల్స్‌ చిరునామాతో అమిత్‌ రాజ్‌ లక్ష్మారెడ్డి పేరున ఈ టానిక్‌ మద్యం దుకాణం లైసెన్స్‌ ఉంది. సాధారణ మద్యం దుకాణానికి లైసెన్స్‌ ఫీజు రూ.1.10 కోట్లు ఉండగా.. టానిక్‌ దుకాణం లైసెన్స్‌ ఫీజు మాత్రం రూ.1.25 కోట్లుగా ఉంది. అయితే ఈ టానిక్‌ మద్యం షాపుకు అనుబంధంగా మరో 9 వైన్ దుకాణాలు ఇదే బ్రాండ్‌ పేరుతో హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటయ్యాయి. ఈ టానిక్‌ మద్యం దుకాణం ఏర్పాటు తెర వెనుక, గత ప్రభుత్వానికి చెందిన పెద్దల హస్తం ఉందని.. ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి వ్యాట్ చెల్లించకుండా ప్రభుత్వానికి నష్టం కలిగేలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. సదరు లక్ష్మారెడ్డి ఓ బీఆర్ఎస్ కీలక నేతకు బినామీగా ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు గత కొన్ని నెలల క్రితం తనిఖీలు నిర్వహించి. ఆయా దుకాణాల్లో లభ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. టానిక్‌ దుకాణం ఒక్కటే రూ.1000 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా టానిక్ మద్యం దుకాణం గడువు ముగియటంతో అధికారులు మూసేయించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్