Sunday, March 29, 2026

మహిళల భద్రత కోసమే షీ టీంలు

- Advertisement -

మహిళల భద్రత కోసమే షీ టీంలు

She teams for the safety of women

-షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ మల్లన్న
మంథని
మహిళల భద్రత కోసమే షీ టీంలు ఏర్పాటు చేశారని షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ మల్లన్న అన్నారు. రామగుండం అడ్మిన్ డిసిపి టి. రాజు  ఆదేశాల మేరకు బుధవారం మంథని లోని కాకతీయ హై స్కూల్ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు  నిర్వహించారు. మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై, ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ మల్లన్న మాట్లాడుతూ  మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందన్నారు.ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు  ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే  సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి  సమాచారం ఇవ్వాలన్నారు, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. మరియు ఆకతాయిల నుండి ఎలా రక్షణగా ఉండాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది స్నేహాలత , సురేష్ తో పాటు ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్