Monday, December 23, 2024

అధిక వర్షాలతో  ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, సీపీ డాక్టర్ అనురాధ

- Advertisement -

అధిక వర్షాలతో  ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, సీపీ డాక్టర్ అనురాధ

District Collector M. Manu Chaudhary, CP Dr. Anuradha inspected affected areas.

కోహెడ
అధిక వర్షాలతో  ప్రభావితమైన ప్రాంతాలను   జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, సీపీ డాక్టర్ అనురాధ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బడుగుల చెరువు పూర్తిగానిండి ఓవర్ ఫ్లోగ వస్తున్న వాటర్ నాలా ద్వారా ప్రవహిస్తూ  కోహెడ గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో ఇండ్లలోకి ప్రవహించడంతో ఇండ్లు దెబ్బతిన్నాయి. డ్రైనేజ్ కూడా  దెబ్బతిని ఇండ్లలోకి నీరు వచ్చింది. ఈ ప్రాంతాలను పరిశీలించి బాధితులతో  మాట్లాడి భరోసా ఇచ్చిన,  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇండ్ల వివరాలను త్వరగా అందించాలని, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని ఇండ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జెసిబి ద్వారా కాలువ తీసి  నాలాలోకి మళ్లించాలని, గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్లపోదలను తొలగించి శుభ్రంగా చేయాలనీ, వ్యాధులు ప్రబలకుండా సానిటేషన్ పగడ్బందీగా  నిర్వహించి ఫాగింగ్, నిలువ నీళ్లలో ఆయిల్ బాల్స్ వేయాలని, నాలాలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో  గ్రామంలో అతి వర్షాలతో చెడిపోయిన డ్రైనేజీ ని పరిశీలించి దానిని వెడల్పు చేయడంలోతు చేయడం మరియు పూడికను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని,అలాగే షాపింగ్ కాంప్లెక్స్ లో, ఇళ్లలోకి నీరు పోయి బారి నష్టం జరిగిందని షాపు యజమాను కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.  తాసిల్దార్ సురేఖ, ఎంపీఓ శోభ లను ఆదేశించారు. వీధి కుక్కలను  పట్టించి సిద్దిపేటలో ఉన్న ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఆపరేషన్ చేయించి వదిలి పెట్టాలని గ్రామపంచాయతీ అధికారుల ఆదేశించారు.
బడుగుల చెరువు నుండి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలాను పూర్తిగా నిర్మించుటకు, ఇప్పటికీ ఉన్న వాల్ కు  రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడం మరియు లోతు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని  ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ వెంట హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి, ఏసీపి సతీష్  తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్