గ్రామాలలో కొలువైన గణనాథులు.
Countless people in villages.
రుద్రవరం
మండల పరిధిలోని పలు గ్రామాలలో గణనాధులను కొలువు తీర్చారు. వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో పెద్దలు యువకులు చందాలు వేసుకుని వినాయకుని విగ్రహాలను పట్టణాలలో కొనుగోలు చేసి ట్రాక్టర్ల ద్వారా శుక్రవారం గ్రామాలకు తరలించారు. రుద్రవరం కొండమయా పల్లెవరం నరసాపురం ఆలమూరు చిన్నకంబలూరు మందలూరు ఎల్లావత్తుల గ్రామాలతో పాటు పలు గ్రామాలలో గణనాథులను కొలువు తీర్చారు. కొందరు యువకులు వినాయకుని విగ్రహాలను మంగళ వాయిద్యాలతో డ్రమ్ముల వాయింపులతో ఊరేగింపుగా తీసుకువెళ్లి మండపాలలో కొలువు తీర్చారు. గణనాధులను కొలువు తీర్చే మండపాలకు రకరకాల విద్యుత్ దీప అలంకరణ చేశారు. రాత్రి గణనాధులకు బోలో శంకర్ మహరాజ్ కి జై అంటూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది.



