- Advertisement -
అధికారులు అప్రమత్తం
Officials alerted
కంట్రోల్ రూముల ఏర్పాట్లు
పార్వతిపురం మన్యం
అల్పపీడనం వలన రాబోయే రెండు రోజులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ – 08963 293046 ఏర్పాటు చేసారు. పార్వతీపురం, పాలకొండ రెవిన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండలాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు అయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు యిబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవరూ ఉండరాదని అన్నారు. తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేసారు. కొండ శిఖర గ్రామాల పరిస్థితిని గమనించి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
గణేష్ ఉత్సవాలలో భాగంగా నిమజ్జనం చేయడం జరుగుతుందని, వారికి తగు జాగ్రత్తలు, సూచనలు చేయాలి. ఒడిషాలో భారీ వర్షాలు పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మికంగా వరదలు వచ్చే సమయంలో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురి అవుతారు,ఇటువంటి ప్రదేశాల్లో పోలీసు, వాలంటీర్లు లేదా ఇతరులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారించాలి. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలు తనిఖీ చేయాలని అన్నారు.
- Advertisement -




