ప్రకాశం బ్యారేజ్ కు కౌంటర్ వెయిట్లు
Counterweights to Prakasam Barrageవిజయవాడ
విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులను తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఏర్పాటు చేసేందుకు కౌంటర్ వెయిట్లు వేసారు. హైదరాబాద్ లోని
బెకెమ్ ఇన్ ఫ్రా కంపెనీలో కౌంటర్ వెయిట్లు తయారయ్యాయి. అధునాతన విధానంలో స్టీల్ తో కౌంటర్ వెయిట్లు తయారు చేసారు. 17 టన్నుల చొప్పున బరువున్న కొత్త కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసారు. పడవలు
ఢీకొని ధ్వంసమైన గేట్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.
=======================
34 ఏపీలో వరదలతో 45 మంది మృతి
అమరావతి
రాష్ట్రంలో వరదలతో 45 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 35 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకరు మృతి
చెందారు. 1,81,53,870 హెక్టార్లలో పంట, 19, 686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. 3,913 కి.మీ మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయి. 558 కిలో మీటర్ల అర్బన్ రోడ్లు ధ్వంసం అయ్యాయి.
78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి.




