కారు లో  అక్రమంగా తరలిస్తున్న గంజాయి

- Advertisement -

కారు లో  అక్రమంగా తరలిస్తున్న గంజాయి

Ganja being transported illegally in the car

భద్రాద్రి కొత్తగూడెం
జూలూరుపాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్సై రాణా ప్రతాప్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రవీణ్ తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా  కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు.
పట్టుబడిన కారు, ద్విచక్ర వాహనాన్ని స్టేషన్కు తరలించి పోలీసులు విచారించారు. కారులో 246 కేజీల గంజాయిని సీలేరు నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్టు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ తెలిపారు.
పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 80 లక్షల ఉంటుందని డిఎస్పి తెలిపారు.
పట్టుబడ్డ నిందితులు బూర్గంపాడు మండలం సారపాక కు చెందిన శివశంకర్ రెడ్డి, నాగేంద్రబాబుగా గుర్తించడం జరిగిందన్నారు.
నిందితుల్లో ఒకరైన శివ శంకర్ రెడ్డి పై గతంలో పాల్వంచ టౌన్, భద్రాచలం పోలీస్ స్టేషన్, బూర్గంపాడు పోలీస్ స్టేషన్, మలక్పేట్ పోలీస్ స్టేషన్, మోతుగూడెం పోలీస్ స్టేషన్ లతోపాటు మహారాష్ట్రలోని లాతూర్ పోలీస్ స్టేషన్లో  ఆరు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు డిఎస్పి వెల్లడించారు. ఇతను గంజాయి పై అక్రమంగా కూడగట్టిన ఆస్తులను సైతం స్వాధీనం చేసుకోనున్నట్లు డిఎస్పీ తెలిపారు. గంజాయి అమ్మిన సేవించిన చట్టరీత్యా నేరమని అలా ఎవరైనా గంజాయి విక్రయానికి పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని డి.ఎస్.పి సూచించారు.ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న జూలూరుపాడు ఎస్సై టాస్క్ఫోర్స్ సిఐ మరియు ఎస్ఐలకు రివార్డు అందిస్తున్నట్లు డిఎస్పి వెల్లడించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular