- Advertisement -
మెఘద్రిగడ్డ రిజర్వాయర్ నీటి మట్టాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
District Collector checked the water level of Meghadrigadda Reservoirపెందుర్తి
మెఘద్రిగడ్డ రిజర్వాయర్ నీటి మట్టాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 61 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 57.4 అడుగులు ఉంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలలో వర్షం లేకపోవడంతో ఎటువంటి ఇబ్బంది లేదు. రిజర్వాయర్ లో నీటిమట్టం పెరిగినట్లయితే ఆరు గేట్లలో నాలుగు గేట్లు తెరవడానికి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నాం. డాం దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేసి గేట్లు తెరిచే అవకాశం ఉంది. ప్రజల తాగునీటి కొరకు మేఘాద్రి గడ్డ డ్యామ్ ను నింపుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో ఈ నీటిని మంచి నీరుగా పనికొస్తుంది. రిజర్వాయర్లో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఈతలు కొట్టడానికి దిగవద్దని అన్నారు.
- Advertisement -




