- Advertisement -
బుడమేరు వరద ఉధృతి
Budameru flood surge
వరుస సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి లోకేష్
విజయవాడ
బుడమేరు కు వస్తున్న వరద ఉధృతి పై మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతం అయ్యేలా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కుల కు సీపేజ్ లీకేజ్ తగ్గింది. పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో లీకేజ్ అరికట్టేందుకు జియో మెంబ్రేన్ షీట్ అధికారులు వినియోగిస్తున్నారు. వస్తున్న వరద ను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేసారు.
- Advertisement -



