- Advertisement -
కష్ట పడితే ఏదైనా సాధ్యమే…ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు..
Anything is possible if you work hard...Principal Sangepu Nageswara Rao..రుద్రవరం,
ఇంజినీరింగ్ లో ఆంధ్ర, అన్నమయ్య యూనివర్సిటీ క్యాంపస్ లలో సీట్లు సాధించిన రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధ్యమేనని మా కళాశాల విద్యార్థులు నిరూపించారని ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల, రెండవ సంవత్సరం చదివిన విద్యార్థులు బి. రమ్య ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ,బి. వంశీ అన్నమయ్య యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ లో సీట్ సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు.
రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి క్రీడల్లో తమ పాఠశాల కళాశాల తరపున పాల్గొని, గొప్ప ప్రదర్శన కనబరిచి ఉత్తమ ఫలితాలు పొందారు. అదే తరహాలో మంచి తర్ఫీదు ఇచ్చిన పి. డి శ్రీనివాసులు ను అభినందించారు. క్రీడా విభాగంలో తనకి సీటు రావడం ఎంతో మందికి తాను ఆదర్శం అని, ఈ క్రీడా
సర్టిఫికెట్ తనకి మంచి సీటు వచ్చేలా చేసింది అని పి. డి శ్రీనివాసులు అన్నారు..బైరి వంశి బాగా కష్ట పడి చదివినాడు.టాలెంట్ ఉండే వాళ్ళు ఎక్కడైనా రాణిస్తారు.ఇద్దరు విద్యార్థులు ఒక మంచి స్థానం లో ఉండాలి అని వైస్ ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ అన్నారు.
ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఇంజనీరింగ్ క్యాంపస్ లలో ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయ బృందం నాన్ టీచింగ్ సిబ్బంది తల్లి తండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
- Advertisement -




