ప్రజల,వాహనదారుల సమస్యలపై స్పందించిన తుగ్గలి ఎస్సై

- Advertisement -

ప్రజల,వాహనదారుల సమస్యలపై స్పందించిన తుగ్గలి ఎస్సై

Tuggali SS responded to the problems of people and vehicles

 కాంట్రాక్టర్ సహాయంతో రోడ్డుకు మరమ్మత్తులు
తుగ్గలి
మండల కేంద్రమైన తుగ్గలిలోని రైల్వే బ్రిడ్జి నందు అధిక వర్షాల వలన రోడ్డు దెబ్బతిని ఏర్పడిన పెద్ద గుంతల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు,ప్రజల పట్ల తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తి స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు.గత కొద్దిరోజులుగా బ్రిడ్జి నందు ఏర్పడిన గుంతల సమస్యలను పరిష్కరించాలని పలు పత్రికలలో ప్రచురించిన కూడా సంబంధిత రైల్వే,ఆర్ అండ్ బి అధికారులు ఎవరు స్పందించలేదు.బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలని సిపిఐ నాయకులు ధర్నా చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. వాహనదారుల మరియు ప్రజల ఇబ్బందులపై తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తి స్పందించి ఆదివారం రోజున పగిడిరాయి కొత్తూరు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కొత్తూరు శివరాముడు సహకారంతో జెసిబి ద్వారా రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ తో గుంతలను పూడ్చారు. గుంతలు పూడ్చడంతో వాహనదారులు మరియు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలను కొనసాగిస్తున్నారు.దీనిపై పలువురు వాహనదారులు,గ్రామస్తులు తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తి ను,కాంట్రాక్టర్ శివరాముడు ను అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular